ఢీల్లీకి సీఎం, పీసీసీ చీఫ్
- మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి, మహేష్‌కుమార్ భేటీ
- రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చ
- మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అంశంపై ఆరా తీసిన ఖర్గే
- వేంనరేందర్‌రెడ్డిని పరిచయం చేయించిన సీఎం
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నుంచి సీఎం, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ మంగళవారం మధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
అందుకు ఈ ఇద్దరు నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రాజ్యసభ అభ్యర్థుల విజయంలో పార్టీ అనుసరించిన అంశం, అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలు, ఇతర అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అంశంపైన ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకు ముందే జీవన్‌రెడ్డి అంశంపై ఖర్గే ఆరా తీసినట్లుగా తెలిసింది.
పార్టీలో సీనియర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అవసరమైతే అతనితో మాట్లాడాలని ఖర్గే సూ చించినట్లుగా సమాచారం. చెబుతున్నా యి. జీవన్‌రెడ్డికి బుజ్జగించి పార్టీలో ఉండే విధం గా చూడాలని సూచిం చినట్లుగా తెలిసింది. సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేష్‌షెట్కార్ ఉన్నారు.




