calender_icon.png 8 November, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

08-11-2025 07:31:31 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్ "  డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచారు.  ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తున్నదని, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరుతున్నాయని అందుకు ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.