08-11-2025 07:32:19 PM
టిఆర్ఎస్ పార్టీ నాయకుడు షేక్ జహంగీ..
వనపర్తి టౌన్: ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు విస్తరించిపోతున్న వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనుకబడి పోతుందని 31వ వార్డు సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల కేడీఆర్ పార్కు అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారవుతుందని వనపర్తి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు షేక్ జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్కుల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి హయాంలో పార్కులను ఎంతో అభివృద్ధి చేశారని ఆ తర్వాత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పట్టణ మున్సిపాలిటీని సుందరీకరణ చేశారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాలం గడిచినా కూడా 31వ వార్డులో గల పార్కులను గాలికి వదిలిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 31వ వార్డు లో గత 15 సంవత్సరాలు మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని కానీ పార్కుల అభివృద్ధితో పాటు 31వ వార్డులోని అనేక సమస్యలు ఆవిష్కృతంగా పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.
31వ వార్డులో గల పార్కులను అభివృద్ధి చేయకపోవడం పట్ల కాలనీవాసులు విద్యార్థులు, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం వేళలో వ్యాయామం చేయడానికి దూరం వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని ఎంతోమంది ఈ కాలనీలో ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొంది వ్యాయామం చేయడానికి వాకింగ్ చేయడానికి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పార్కు అభివృద్ధి కోసం 31 వ వార్డు ప్రజలు ఎంతో కాలం ఎదురు చూస్తున్న కూడా అవార్డు కౌన్సిలర్ పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.
ఈ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలనీ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ పార్కును వెంటనే అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా 31వ వార్డు పార్కును వెంటనే కాలనీ ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆ పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని విద్యార్థులకు అవసరమైన వ్యాయామ పరికరాలు పార్కులో నెలకొల్పాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.