08-11-2025 07:28:59 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం స్థానిక విశ్రాంత భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు కలిగిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత ముందుకుసాగుతుందని నాయకులు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టియే మెంబెర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్,మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు,పట్టణ యూత్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నలిమేల సత్తన్న, మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్,మోత్కూరి వెంకటస్వామి గౌడ్, దేవేందర్ రెడ్డి,గుత్తికొండ శ్రీధర్, అమీర్, బుద్దెదేవా,గోపతి రమేష్, రాజు, మల్యాల శివ,ఉతుర్రి రవీందర్, పెట్టాం శ్రీనివాస్, రంజిత్ సింగ్,స్థానిక కాంగ్రెస్ నేతలు, మహిళా నాయకులు, యువకులు పాల్గొన్నారు.