14 April, 2026 | 1:22 PM

Breaking News

సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •  

రాష్ట్ర ప్రజలకు సీఎం బోనాల శుభాకాంక్షలు

26-06-2025 01:03 AM

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): బోనాల ఉత్సవాలు ప్రారం భం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ర్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలతో రాష్ర్టంలో పండుగ వాతావరణం మొదలవుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతిఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఈ మేరకు బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకట నలో ఆయన ఆకాంక్షించారు.

చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగ దాంబిక ఎల్లమ్మతల్లికి ఆషాఢ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో బోనాల సందడి నెలకొం టుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురోగ్యాలతో జీవించాలని రాష్ర్టం లో వర్షాలు సమృద్ధిగా కురిసి పంట లు బాగా పండాలని, రాష్ర్టం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా తల్లి దీవెనలు ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

జంటనగరాల్లో  బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం రూ.20కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకో వాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.