14 April, 2026 | 1:23 PM

Breaking News

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •  

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

26-06-2025 01:04 AM

చేగుంట, జూన్ 25 : చేగుంట ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు  నిర్వహించారు. ఈ సందర్భంగా చేగుంట ఎస్త్స్ర  చైతన్య కుమార్ రెడ్డి  మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  చిన్నతనంలోనే  మారక ద్రవ్యాల గురించి తెలుసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని అన్నారు.

ఒకసారి మత్తు పదార్థాలకు  అలవాటు పడితే అనేక రకాల సమస్యలు  ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటికి అలవాటు పడి, అప్పుల పాలై ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని,  విద్యార్థులు వాటి పట్ల  అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో చేగుంట మండల విద్యాధికారి నీరజ, చేగుంట ఎస్త్స్ర 2 బిక్య నాయక్, రఘుపతి, రాజేశ్వర్, సుధాకర్ రెడ్డి, శారద, చల్లా లక్ష్మణ్, మనోహర్ రావు, రావుల వెంకటేష్, రేఖ, సురేందర్, రాధా,  రమ, రమాదేవి, సరస్వతి, భవాని,శ్రీవాణి, ఉమా, ఉమామహేశ్వరి  తదితరులు పాల్గొన్నారు.