29-01-2026 12:00:00 AM
మోతె, జనవరి28:- క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని మోతె మండల అభివృద్ధి అధికారి ఆంజనేయులు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామవరం లో సి.ఎం.కప్ మండల స్థాయి క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలలో మరుగున పడిపోయిన క్రీడలను మెరుగు పరచడానికి గాను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ పోటీలు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహించబడుతాయని అన్నారు. మండల స్థాయి క్రీడలలో మండలంలోని వివిధ గ్రామాల క్రీడల జట్టులు పాల్గొన్నాయి. కబడ్డీ, వాలీబాల్, కో కో పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దైద శ్రవణ్,మండల ఎం.పి.ఓ. కృష్ణవంశీ, మండల విద్యాధికారి గోపాల్ రావు, ప్రధానోపాధ్యాయులు బి.ఎల్. ఎన్. చారీ,మండల వ్యాయామ ఉపాధ్యాయులు కోటేశ్వర్ రావు, నాగేశ్వర్ రావు, రేణుక, గురులక్ష్మి పాల్గొన్నారు.
గరిడేపల్లిలో
గరిడేపల్లి, జనవరి 28 :విద్యార్థుల్లో క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక వికాసం పెరుగుతుందని క్రీడా ఉత్సవాల మండల కమిటీ చైర్మన్ ఎంపీడీవో ఆర్ సరోజ కో చైర్మన్ మండల విద్యాధికారి చత్రు నాయక్,కమిటీ సభ్యులు తహసిల్దార్ స్రవంతి అన్నారు.మండల కేంద్రంలోని మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గరిడేపల్లి ప్రాంగణంలో మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ కబడ్డీ, ఖో- ఖో,వాలీబాల్ తో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పి డి హుస్సేన్,ఫిజికల్ డైరెక్టర్లు అంబేద్కర్, రాంప్రసాద్, సైదిరెడ్డి,బాబు,ప్రదీప్,సిఆర్పిలు రామకృష్ణ,అశోక్ కుమార్ వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు
గ్రామీణ క్రీడాకారులకు ప్రాధాన్యత
కోదాడ (నడిగూడెం)జనవరి 28: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారి నైపుణ్యాల వెలికి తీయడం కోసమే తెలంగాణ ప్రజా ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలోనిశ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 2025 సెకండ్ విడత సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్తిస్తుందని, క్రీడాకారులు సీఎం కప్ క్రీడలను సద్వినియోగం చేసుకోని, రాష్ట్ర స్థాయిలో పాల్గొని గ్రామానికి, మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దున్నా శ్రీనివాస్,బూత్కూరి వెంకటరెడ్డి, తహసిల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో మల్సూర్ నాయక్,
ఎంఈఓ ఉపేందర్ రావ్, ఎంపీఓ విజయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు,ఆర్ ఐ లు గోపాలరావు,మాల్సుర్, పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి,జిపిఒ కోటయ్య, ఉప సర్పంచ్ ఎలుగూరి నాగరాజు, దున్నా శ్రీకాంత్,దున్నా లింగయ్య పాల్గొన్నారు.