calender_icon.png 29 January, 2026 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదిగో ఎక్సుజ్ స్కాం

29-01-2026 01:07:09 AM

మైక్రో బేవరేజ్ టెండర్ల పంపకాలు

మొత్తం 110 అప్లికేషన్లలో 25.. ముఖ్యనేతకు 21, మంత్రికి 4టెండర్లు ఇచ్చేందుకు సిద్ధం 

ఒక్కో బేవరేజ్ దగ్గర 1.80 కోట్లు.. ముఖ్యనేతకు 1.50 కోట్లు, ఆయన తోడూనీడకు 30 లక్షలు

వైన్స్ టెండర్లలో లక్కీ డ్రా తీయకుండానే షాపుల కేటాయింపు 

హాలో గ్రామ్ టెండర్ అల్లుడుకి కావాలని ముఖ్యనేత, కుమారుడుకి కావాలని మంత్రి పంచాయితీ

తెలంగాణ భవన్‌లో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మైక్రో బేవరేజ్ దక్కించుకునేందు కు 110 అప్లికేషన్‌లు వచ్చాయని, అందు లో 25 అప్లికేషన్ల టెండర్‌లను ముఖ్యనేతకు, మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యా రని తెలిపారు. ఈ అప్లికేషన్లలో మంత్రి 4, ముఖ్యనేత కోటా కింద 21 టెండర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వెల్లడించా రు.

బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. ఈ మధ్య ముఖ్య నేతకు నీడగా ఉండే వ్యక్తి వార్తల్లో నిలుస్తున్నారని, ముఖ్యనేతకు నీడగా ఉండే, ఆ నేత నేరుగా ముఖ్య నేత ఇంటి కి వెళ్తారని, ఈ మధ్య ముఖ్యనేత తిరుపతికి పోయినప్పుడు నీడగా ఉన్నారని వివ రించారు.

ఈ కుంభకోణంలో భాగంగా ఒక్కొక్క బేవరేజ్ దగ్గర అన్ అఫీషియల్‌గా రూ. 1.80 కోట్లు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని, అందులో రూ.1.50 కోట్లు ముఖ్యనేతకు, రూ.30 లక్ష లు తోడుగా ఉన్న వ్యక్తికి వెళ్తాయని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన వైన్స్ షాపుల టెండర్లలో లక్కీ డ్రా తీయకుండానే కొందరికి టెండర్లు వచ్చాయని చెప్పారు. 

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు రూ.4,500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని, 16 నెలల నుంచి సరఫరా చేసే కంపెనీలకు డబ్బు లు చెల్లించడం లేదని మండిపడ్డారు. దీంతో బ్రీజర్ సరఫరా రాష్ర్టంలో ఆగిపోయిందని, మిగిలిన కొన్ని కంపెనీలకు డబ్బులు చెల్లించ డం లేదని, మల్టీ నేషనల్ కంపెనీలు సరఫరా నిలిపివేస్తామని రాష్ట్ర ప్ర భుత్వానికి అనేక సార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు.

మంత్రు ల మధ్య వాటాల పంచాయితీతో ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని వల్ల రాష్ట్ర ఆదాయం దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపారు. హాలోగ్రామ్ టెండర్ వ్యవహా రంలో అల్లుడుకి కావాలని ముఖ్యనేత, తన కుమారుడుకి కావాలని మంత్రి పంచాయితీ లో ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద విరమణకు దారితీసిందని మండిపడ్డారు.

మద్యం తయారీ ప్రభుత్వమా.. రైతు ప్రభుత్వమా? 

బీరు కంపెనీలకు ఇచ్చే ప్రాధాన్యత, రైతులకు ఇవ్వడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులు అంటే చులకన అని హరీశ్ విమర్శించారు. ఇది మద్యం తయారీ ప్రభుత్వమా.. రైతు ప్రభుత్వమా అని ప్రశ్నించారు. మెదక్ జిల్లా సింగూర్ డ్యాం కింద రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారని, సంగారెడ్డిలో 40వేల ఎకరాలకు, మెదక్ జిల్లా ఘనపురం కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో ఉండే బీరు కంపెనీలకు మాత్రం ఎటువంటి హాని లేకుండా బీరు కంపెనీలకు నీళ్లు సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాలతో బీరు కంపెనీలకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని, మద్యం తయారీదారులకు కొ మ్ము కాసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గీత కార్మికులను వందల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 850 మంది గౌడలు మరణించారని ఆవేదనవ్యక్తం చేశా రు.

బాధితులకు  ఒక్క రూపాయి ఇవ్వలేదని, బీఆర్‌ఎస్ హయాంలో రూ. 5 లక్షల బీమా పథకం తీసుకొచ్చి గౌడన్నల కుటుంబాన్ని మేము ఆదుకున్నామన్నారు. కాంగ్రెస్  పార్టీ రూ.10 లక్షల బీమా ఇస్తామని చెప్పి రూ.10 లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి అనేక మాటలు గౌడన్నలకు చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిందని, గల్లీ గల్లీకి మద్యం దుకాణాలు తెచ్చారని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 10 వేల కోట్ల ఆదాయం పెంచుకున్నారని, మహిళలకు తులం బంగారం ఇవ్వడం లేదుగానీ, తాగుబోతుల తెలంగాణగా మాత్రం మార్చారని ఎద్దేవా చేశారు.