29-01-2026 12:00:00 AM
హనుమకొండ,జనవరి 28 (విజయ క్రాంతి): మేడారం మహాజాతర వేళ భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ అత్యాధునిక నిఘా ఏర్పాటు చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి గద్దెల వరకు ప్రతి వాహనం కదలికలను కెమెరాల్లో బంధించనున్నారు. ఇందుకోసం ట్రై సిటీ పరిధిలో 715, మేడారం జాతరకు వెళ్లే మార్గంలో 530 సీసీ కెమెరాల ను అమ ర్చి వాటన్నిటిని కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా క్షణాల్లో గుర్తించేలా వ్యవస్థను సిద్ధం చేశారు. తద్వారా జాతరకు పోయే దారిలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగిన, ట్రాఫిక్ జామ్ అయి నా క్షణాల్లో పరిష్కరించే విధంగా పోలీస్ వ్యవస్థను ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా అనుసంధానించడం జరిగింది. గతంలో జరిగిన ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఈ దిశగా నిఘా వ్యవస్థను వ్యవస్థను ఏర్పాటు చేశారు.