calender_icon.png 27 January, 2026 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్‌లో సీఎం కప్ క్రీడా పోటీలు

27-01-2026 06:30:16 PM

సుల్తానాబాద్ ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 28 నుంచి 30 తేదీల వరకు నిర్వహించాల్సిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ, మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు అనివార్య కారణాలవల్ల వాయిదా పడినట్లు మండల విద్యాశాఖ అధికారి రాజయ్య మంగళవారం తెలిపారు. వాయిదా పడిన ఈ క్రీడా పోటీలను ఫిబ్రవరి 2, 3 తేదీలలో మున్సిపాలిటీ, మండల స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ సీఎం కప్ క్రీడా పోటీల్లో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల ఎస్ జి ఎఫ్ కార్యదర్శి ప్రణయ్, ఫిజికల్ డైరెక్టర్స్ ప్రసాద్, ఆసియా, సంధ్య, శ్రీవాణి, సరోజ, వెంకటేష్, సత్యం, శివ, అజ్జు పాల్గొన్నారు.