27-07-2025 01:34:57 AM
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): కార్గిల్ యుద్ధవీరుడు కల్నల్ జాయ్ దాసుగుప్తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సత్కరించారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కల్నల్ దాసుగు ప్తా తన తల్లితో వెళ్లి కలిశారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన జాయ్‌దాస్ గుప్తా సికింద్రాబాద్‌లోని వెస్లీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.
చెన్నైలో ని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శి క్షణ పొందారు. కల్నల్ దాసుగుప్తా కు రెండు కంపెనీల నాయకత్వం అ ప్పగించారు. దాసు గుప్తా ధైర్య సా హసాలకు సేన పతకం లభించింది. సీఎంను కలిసిన వారిలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఉన్నారు.