27-07-2025 01:33:29 AM
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వ ర్లు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు 48 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఎక్కువసార్లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కోసమే వెళ్లారని ఆ రోపించారు. శనివారం ఆయన బీజే పీ కార్యాలయం లో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి బీసీల విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. సీఎం కు ర్చీ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేదా భట్టి విక్రమార్కకు అప్పగించాలని డిమాండ్ చేశారు.