calender_icon.png 6 December, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

08-11-2024 08:23:52 PM

కోదాడ,(విజయక్రాంతి): నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమని కోదాడ శాసనసభ్యురాలు ఎన్.పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్  చెక్కులను కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన కత్తి సత్యనారాయణకు అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈర్ల సీతారాంరెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ ఇర్ల లక్ష్మారెడ్డి, సింగారెడ్డి సుమన్ రెడ్డి, ఇర్ల నారపరెడ్డి, కాసాని సత్యం తదితరులు పాల్గొన్నారు.