calender_icon.png 6 December, 2024 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో త్వరలో హైడ్రోజన్ ఆధారిత వాహనాలు

08-11-2024 08:50:23 PM

హైసెల్ ఎంగేజ్ సంస్థ ఫౌండర్ వేణు వర్మ కలిదిండి 

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హై సెల్ ఎంగేజ్ అనే స్టార్టప్ కంపెనీ భరతదేశంలోనే సొంత టెక్నాలజీతో హైడ్రోజన్ బస్సు నడిపే స్టార్టప్ అని హై సెల్ ఎంగేజ్ సంస్థ ఫౌండర్  కలిదిండి వేణు వర్మ  తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మాదాపూర్ లోని టీ హైవ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా  కలిదిండి వేణువర్మ మాట్లాడుతూ పెట్రోల్ బంక్ ల మాదిరిగానే, హైడ్రోజెన్ బంక్ లు కూడా వుంటాయన్నారు.

హైడ్రోజన్ నింపిన వాహనం స్టార్ట్ అయ్యినప్పుడు ట్యాంక్ లో నుంచి హైడ్రోజెన్ ని తీసుకొని దానితో పాటు గాలి లో ఉన్న ఆక్సిజను ను కూడా తీసుకుంటుందన్నారు.హైడ్రోజన్,ఆక్సిజన్ కలవటం ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తీ తో వాహనం నడుస్తుందిని తెలిపారు.పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల లాగా హైడ్రోజన్ వాహనానికి పోగా రాదు కేవలం ఆవిరి మాత్రమే బయటకు విడుదల చేస్తుందని, దీని వల్ల కాలుష్యం అనేది అసలు ఉండదని,ఫుల్ ట్యాంక్ హైడ్రోజన్ తో నింపితే 600-700 కీమీ వరకు మైలేజ్ వస్తుందన్నారు.

జర్మనీ,స్పేయిన్ దేశాలలో మా పరిశోధకులు హైడ్రోజెన్ బస్సులు, ట్రక్ లు నాలుగు సంవత్సరాల ముందే నడుపుతున్నరని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలోని నాలుగు రాష్టాల ప్రభుత్వాలతో చర్చలుజరుపుతున్నామన్నారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ లో ప్రముఖ వ్యక్తి ఆక్సల్ ఏంజెల్లీ కూడా ఈ స్టార్టప్ కు సేవలు అందిస్తున్నారని వేణువర్మ కలిదిండి తెలిపారు. వోక్స్ వ్యగన్ మాజీ సీఈఓ ఐన డాక్టర్ ఫ్రాంక్ లూఇచ్మాన్ కూడా ఈ కంపెనీ వ్యవస్థపాకులలో ఒకరని పేర్కొన్నారు.