6 April, 2026 | 2:56 PM

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం

13-02-2026 12:00 AM

ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్ ఫిబ్రవరి, 12 సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం కర్నూల్ పట్టణంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో ఐజ పట్టణానికి చెందిన వెంకటేశ్వరమ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల రూపాయలు ఎల్‌ఓసి ని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల వైద్య సహాయానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ధైర్యాన్నిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.