6 April, 2026 | 4:52 PM

Breaking News

కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •  

మెజారిటీ స్థానాలు బీజేపీకే రాబోతున్నయ్

13-02-2026 12:00 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): కరీంనగర్ కార్పోషన్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో బీజేపీ కార్పోరేటర్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మా ట్లాడుతూ యావత్ దేశమంతా కరీంనగర్ ఫలితాలవైపు చూస్తోందన్నారు.

బీజేపీకి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. కరీంనగర్ లో బీజేపీకి మెజారిటీ స్థానాలు రాబోతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైందన్నారు. ప్రలోభాలకు గురిచేసి బీజేపీ కార్పొరేటర్లను గుంజాలని చూస్తోందన్నారు. అప్పుడే కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేస్తూ ప్రలోభాలకు తెరదీశారని, జాగ్రత్తగా ఉండండని సూచించారు.

పార్టీని మోసం చేస్తే కన్నతల్లిని మోసం చేసినట్లేనని, అధికార పార్టీ ఆశలకు లోబడి ఎవరైనా కాంగ్రెస్ లోకి వెళితే తీవ్రమైన పరిణామాలుంటాయని, కార్యకర్తల ఆవేశాన్ని తట్టుకోవడం అసాధ్యమని హెచ్చరించారు. మాజీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కౌంటింగ్ ఏజెంట్ల ద్రుష్టి అంతా బ్యాలెట్ పేపర్ మీదే ఉండాలని చెప్పారు. చర్చల పేరుతో, గొడవల పేరుతో ద్రుష్టి మళ్లించేందుకు ప్రత్యర్ధులు ప్లాన్ చేసే అవకాశముందని,

వాటికి తావివ్వకుండా బ్యాలెట్ పైనే ద్రుష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రంలో ఎవ్వరితోనూ గొడవ పడొద్దని, ఏదైనా అభ్యంతరం ఉంటే రాతపూర్వకంగా రాసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటు పార్టీకి అత్యంత ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్ అభ్యర్థులంతా బండి సంజయ్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల్లో గెలిస్తే కరీంనగర్ నుండి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లి హనుమాన్ ను దర్శించుకుంటే బాగుంటుందని సూచన రాగా సమావేశానికి హాజరైన కార్పొరేటర్ అభ్యర్థులంతా సమ్మతిని తెలియజే శారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, పార్టీ సీనియర్ నేతలు వాసాల రమేశ్, సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.