calender_icon.png 22 July, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

21-07-2025 08:49:57 PM

మునగాల: మహాలక్ష్మి మృతి చాలా బాధాకరమని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavathi Reddy) అన్నారు. సోమవారం మండల పరిధిలోని కలకొవ గ్రామానికి చెందిన నెమ్మది వెంకటేశ్వర్లు వసుంధర దంపతుల కుమార్తె తనుషా మహాలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహాలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కసర్ల కోటయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, ఉప్పల జానకి రెడ్డి, కాసర్ల శీను, సిపిఎం నాయకులు బుర్రి శ్రీరాములు, కొంపల్లి వీరబాబు, శంకర్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.