21-07-2025 08:37:50 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు చేయూత పథకం ద్వారా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని నిరీక్షిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే కొత్తగా లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని, కొత్తవారికి పింఛన్ల కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.