calender_icon.png 22 July, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిష్టయ్యకు విభూషణ్ జాతీయ పురస్కారం

21-07-2025 08:12:41 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేటకు చెందిన కళాకారుడు పిల్లిట్ల కిష్టయ్య జాతీయస్థాయి భారత విభూషణ్-2025 పురస్కారాన్ని అందించారు. ఆదివారం కరీంనగర్ ఫిలిం భవన్ లో శ్రీ ఆర్యాణ ఈ సకల కళావేదిక శ్రీ గౌతమేశ్వర సాహిత్య కళా సేవ సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రధాన ఉత్సవం జరిగింది. ముఖ్య అతిథి వైరాగ్యం ప్రభాకర్ రావు, డాక్టర్ గీతారెడ్డి, ప్రముఖ రచయిత గోపాల్ రావు, లావణ్య, డాక్టర్ దూడపాక శ్రీధర్, చేతుల మీదుగా అవార్డును ప్రధానం చేశారు. అవార్డుతో పాటు బంగారు పథకం ప్రశంసా పత్రంలతో ఘనంగా సత్కరించారు. కిష్టయ్యకు భారత విభూషణ్ పురస్కారం లభించడం పట్ల తెలంగాణ చిందు & సింధు హక్కుల పోరాట సమితి నుండి పి పరశురాములు పలువురు సంఘం నాయకులు కళాకారులు అభినందించారు.