calender_icon.png 22 July, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేగాను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొదెం

21-07-2025 08:31:34 PM

మణుగూరు (విజయక్రాంతి): బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(BRS District President Rega Kantha Rao)ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సోమవారం పరామర్శించారు. కాంతారావు మాతృమూర్తి నరసమ్మ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. తాజాగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లిలోని మాజీ ఎమ్మెల్యే రేగా నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతిరాల రవికుమార్, రౌతు నర్స్మింహరావు, కోలపూడి వరుణ్, వాసిరెడ్డి సాంబశివరావు పాల్గొన్నారు.