21-07-2025 09:04:20 PM
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి..
చిన్నచింతకుంట: అందరం ఐక్యంగా ఉండి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA G Madhusudan Reddy) అన్నారు. మండలంలోని అమ్మపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రావు, సునీల్ శెట్టి, జెట్టెం నవీన్, అశోక్, సింగోటం, బాల కొండమ 21 మంది నాయకులు, బీజేపీ కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజా పాలన ప్రభుత్వం అందరి మంచి కోరుతుందని, మునుముందు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తుందని తెలిపారు. అనతి కాలంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టించడం జరుగుతుందని తెలియజేశారు. ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆ నమ్మకాన్ని రెట్టింపు అయ్యేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.