calender_icon.png 22 July, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ

21-07-2025 08:06:21 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ఆదేశాల మేరకు సోమవారం 58వ డివిజన్ పరిధి రాఘవేంద్రనగర్ లో ఏఈ నరేందర్ రాజు, డివిజన్ అధ్యక్షులు తాళ్లపెళ్లి సుధాకర్ లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన అరుసు స్వప్న ఇంటి నిర్మాణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ది చేకూర్చేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ శ్యాం ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు మండల సమ్మయ్య, తాళ్లపల్లి విజయ్ కుమార్, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి మేరీ, తాళ్లపల్లి ప్రసన్న కాలనీవాసులు అంజన్ రావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.