15 March, 2026 | 7:19 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్‌

11-02-2026 01:41 PM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం కొడంగల్ లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్య సౌధానికి పునాది ఓటు అని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కోరుతున్నాను. ఓటు వేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.