26-07-2024 12:52:20 PM
మహబూబ్నగర్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. జడ్చర్ల నియోజకవర్గంలో 27వేల మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఉచితంగా షూ అందిస్తున్నారు. హైదరాబాద్ లోని ముఖ్య మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అఅధికరి గోవింద రాజు మండల విద్యాశాఖ అధికారి మంజుల దేవి, కమ్యూనిటీ మొబైలైజేషన్ అధికారి బాలు యాదవ్ బైకాని పాల్గొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ఎంపిక చేసిన కొంత మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని తెలిపారు