03-11-2025 09:16:03 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో(Chevella Mandal) జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించాలని కోరారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై(Hyderabad-Bijapur National Highway) రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలోని మీర్జాగూడ గ్రామం సమీపంలో సోమవారం తాండూరు డిపోకు చెందిన టీజీఎస్ఆర్టీసీ బస్సు కంకరతో నిండిన లారీని ఢీకొన్న(Ranga Reddy road accident) ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 72 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.