14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

సీఎం రేవంత్‌రెడ్డి గుణం మార్చుకోలేదు

03-02-2026 12:29 AM
  1. 4 రోజులు హార్వర్డ్‌లో చదువుకున్నా మారని భాష
  2. తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారు
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి) : హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలని, అమెరికా వెళ్లి హార్వర్డ్‌లో నాలుగు రోజు లు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని విమర్శించారు.

హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సం స్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. నాలు గు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ర్టం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.