17-12-2025 11:45:42 AM
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం మాదారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. తమకు ఓట్లు వేయాలంటూ కాన్వాసింగ్ చేస్తున్నారని పరస్పర ఆరోపణలతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో సర్పంచ్ అభ్యర్థి రాములుకు తీవ్ర గాయాలు కావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సాయిపైన బీఆర్ఎస్ నేతలు దాడి చేశారు.
ఈ దారి నలుగురికి గాయాలు కావడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పోలింగ్ స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలింగ్ బూత్ లో ఉన్న కొంతమంది ఏజంట్ లు పలు పార్టీలకు ఓట్లు వేయాలంటూ బలవంతం చేస్తున్నారన్న ఆరోపణలతోనే ఈ దాడి జరిగిందని ప్రత్యేక్ష సాక్షుల ద్వారా తెలుసుకున్నారు.