17-12-2025 12:02:30 PM
ఎన్నికల కేంద్రం నుంచి వెళ్లకుంటే ఇక్కడే కూర్చుంటా హెచ్చరించిన కోవలక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): మూడో విడత ఎన్నికల్లో భాగంగా రాజంపేట గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రానికి సమీపంలోని ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసం వద్ద ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమ్మిగా ఉండడంతో సిఐ బాలాజీ వరప్రసాద్ అక్కడికి చేరుకొని అందరిని చదర కొట్టడంతో ఇది గమనించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్కడికి చేరుకొని 100 మీటర్లకు దూరంగా ఉన్నవారిని హెచ్చరించడం తగదని సిఐతో అన్నారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేకపోతే( రోడ్డుపై) ఇక్కడే కూర్చుంటానని హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన నాయకులను ఏమేలకుండా తమ పార్టీకి చెందిన వారిని చెదరగొట్టడం ఏంటని ప్రశ్నించారు. గవర్నమెంట్ తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.