calender_icon.png 17 December, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ రోజే రూల్స్ గుర్తొచ్చాయా..?

17-12-2025 11:53:22 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి):  ఎన్నికల నియమావళి దాదాపుగా గత నెల  27 నుండి అమల్లోకి వచ్చినప్పటికీ అధికారుల అలసత్వం దర్శనం ఇస్తుంది. ఈనెల 11న మొదటి విడత 14న రెండో విడత ఎన్నికలు పూర్తవగా మూడో విడతలో రాజంపేట గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అదే ప్రాంతంలో నివాసముంటున్న ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్ ఇంటి ఎదుట ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ఘర్షణకు దారితీసింది.

ఎన్నికల నియమావళి వచ్చి దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ అధికారులు ఫ్లెక్సీలు తొలగించకుండా ఓటింగ్ రోజు వచ్చి వాటిని తొలగించాలని అధికారులు  అనడం వారి పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల నియామవళి పాటించాలని అధికారులు ఓటింగ్ రోజు ఫ్లెక్సీలు తొలగించడం పట్ల ఆయా పార్టీల నాయకులు అధికారుల వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు.