17-12-2025 11:49:59 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని పెదరాస్పల్లి గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలపరిచిన బొమ్మెర రాజన్న సర్పంచ్ గా పోటీ పోటీలో ఉన్నారు. పత్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచారని తను డబ్బులు పంచకపోవడంతో ఓటమి చెందుతానని భయంతో బుధవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయ త్నం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి కాగజ్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు బాధితుని కుటుంబ సభ్యులు మంచిర్యాల తరలించారు.