calender_icon.png 17 February, 2026 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు విజన్, ప్రభుత్వ పాలసీలతో సాగుతున్నాం

17-02-2026 11:42:51 AM

హైదరాబాద్: హైటెక్స్ లో బయో ఏషియా -2026(BioAsia 2026) సదస్సును మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. రెండు రోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి స్టాల్స్ ను పరిశీలించారు. ఫార్మా, సాఫ్ట్ వేర్, చార్మినార్, బిర్యానీకి హైదరాబాద్ ప్రసిద్ధి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్(Global Vaccine Manufacturing Hub) గా హైదరాబాద్ నిలుస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో అవసరమైన మానవ వనరులు, ప్రముఖ విద్య సంస్థలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.  ముందస్తు విజన్, ప్రభుత్వ పాలసీలతో సాగుతున్నామని సీఎం వివరించారు.