calender_icon.png 28 August, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

31వ తేదీలోగా వసతులు సమకూర్చాలి

28-08-2025 05:18:57 PM

హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తాత్కాలిక ప్రారంభానికి అవసరమైన సదుపాయాలను గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) క్షేత్ర స్థాయిలో పర్యటించి వసతులను పరిశీలించారు. ఈ సందర్బంగా స్టేడియం ఆవరణలో ఉన్న హాస్టల్ భవనాలు, అవుట్ డోర్, క్రీడా మైదానాలను పరిశీలించి వాటిలో చేపట్టాల్సిన మరమ్మత్తులు, కల్పించాల్సిన సదుపాయాలను విద్యార్థులకు క్రీడా సదుపాయాలు ఈనెల 31వ తేదీలోగా ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ అశోక్ కుమార్ ను ప్రస్తుతం ఏర్పాటు చేసిన మౌలిక వసతుల గురించి చర్చించారు. అలాగే  జేఎన్ఎస్ స్టేడియం ఆవరణలో విద్యార్థులకు హాస్టల్ వసతిలో ఉండాల్సిన సదుపాయల కల్పనకు, ఇండోర్, అవుట్ డోర్ క్రీడా సదుపాయాలు, పరికరాల ఏర్పాటుకు, అవసరమైన మరమ్మత్తులకు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఇ.ఇ. ఆర్అండ్ బీ సురేష్, నరేందర్ రెడ్డి, కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.