28-08-2025 05:36:25 PM
బిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు నామాల సారయ్య
జనగామ (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) పెద్దపాడు గ్రామంలో బస్టాండ్ కూడలి వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ తేజ సీడ్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర ఫర్టిలైజర్ జనగామ మార్కెటింగ్ డైరెక్టర్ మరిపెద్ది సరిత తిరుపతిరెడ్డి, సంయుక్తంగా విగ్రహాన్ని అందచేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విగ్రహ దాత సరిత తిరుపతి రెడ్డి కుమార్తె అక్షయ జన్మదినం పురస్కరించుకొని సరిత తిరుపతి రెడ్డి, నామాల మంజుల సారయ్య, గౌడ్ గురువారం రోజున గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మోకు లక్ష్మీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అన్నదాత తిరుపతి రెడ్డి, సారయ్య మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు స్వామివారి వారి ఆశీస్సులతో పాడి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మచ్చ సిద్దులు, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు భూస రమేష్, యాదవ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సరికొండ సురేందర్ రెడ్డి, తరిగొప్పుల మాజీ సర్పంచ్ సునీత సుధాకర్ రెడ్డి నామాల రాములు నామాల యాదగిరి, నామాల అశోక్,నామాల రవి అలియాస్ రాజు, పెద్ద పహాడ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మరియు గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.