calender_icon.png 28 August, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీపాద ఎల్లంపల్లిని సందర్శించిన సీఎం

28-08-2025 05:29:54 PM

కాళేశ్వరం లోపాలను అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడి..

రామగుండం (విజయక్రాంతి): కాలేశ్వరం లోపాలపై అసెంబ్లీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. గురువారం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ తో కలిసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్(Sripada Yellampalli Project)ను సందర్శించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ... గోదావరి జలాలకు ప్రాణవాయువు ఎల్లంపల్లి అని అన్నారు. రూ. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. గోదావరి జిల్లాలకు గుండె కాయ, ప్రాణవాయువు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అన్నారు. సాంకేతిక నైపుణ్యంతో నిర్మించడం వల్ల ఎల్లంపల్లి ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక లోపాల వల్లే మేడిగడ్డ కూలిపోయిందన్నారు. అన్నారం సుందిళ్ల బ్యారేజ్ లో సైతం సాంకేతిక లోపాలు ఉన్నాయని.. అందువల్లే వాటిల్లో నీళ్లు అందుకే నింపడం లేదన్నారు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్నా ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో పై అధికారులు సీఎంకు వివ‌రించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయి. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయింది. నిర్మాణంలో లోపాల వల్లే బ్యారేజీ కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదం ఉంది. దాంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. వేలాది ఎకరాలు నీట మునిగే అవకాశాలున్నాయి. నిర్మాణ లోపాలు ఉన్నాయని నివేదికలో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్న మామ స్వాతి ముత్యం, అల్లుడు ఆణిముత్యం. వాళ్లలా తాము 80 వేల పుస్తకాలు చదవలేదు. పుస్తకాలు చదివి ప్రాజెక్టు నిర్మించడం వల్ల కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం. సాంకేతిక నైపుణ్యం వైఫల్యంతోపాటు డిజైన్ నిర్మాణం నిర్వహణలో లోపాలు ఉన్నాయని నివేదికలో తెలిపారు. ఆపై చర్యలు తీసుకుంటామన్నారు.