28-08-2025 05:43:42 PM
ఎంపీడీవో జలంధర్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీఓ జలంధర్ రెడ్డి(MPDO Jalander Reddy) పరిశీలించి ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు ప్రారంభించని వారికి నోటీసులు ఇవ్వాలని, ఇంతకుముందే పనులను ప్రారంభించిన వారిని త్వరగా పూర్తయ్యేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సందీప్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఏఈ కిరణ్, బిల్ కలెక్టర్ బాబు పాల్గొన్నారు.