28-08-2025 05:16:21 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్(MLA Naini Rajender Reddy) గురువారం 58వ డివిజన్ పరిధిలోని స్నేహ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అత్యవసర ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు, నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఏ బి సి లుగా పనులను గుర్తించి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు. వర్షాలలో సైతం నగరంలో ఒకటి, రెండు ప్రాంతాలలో తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రతి కార్యక్రమంలో ప్రజల సహకారం వలనే సాధ్యమైందని అన్నారు.
బుధవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 57వ డివిజన్ గోకుల్ నగర్ ప్రాంతంలో నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్(Commissioner Chahat Bajpai)తో కలసి ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రవాహానికి అడ్డుగా ఉండే ప్రాంతాలకు గుర్తించి పరిష్కార మార్గాలను చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ మాజీ జిల్లా అధ్యక్షులు కరాబు రాజేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ కుమార్ యాదవ్, 58వ డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, కాంగ్రెస్ నాయకులు మండల సమ్మయ్య, పేరాల శ్రీనివాసరావు, తాళ్లపల్లి రవీందర్ (జెకె) , తాళ్లపల్లి విజయకుమార్, తాళ్లపల్లి మేరీ, జనగాం శ్రీనివాస్, కాలనీవాసులు, చిన్న, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.