28-08-2025 05:01:07 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బల్లార్షా, బెల్లంపల్లి రైల్వే సెక్షన్ల మధ్య నూతనంగా చేపట్టిన థర్డ్ లైన్ ట్రాక్ ను గురువారం సెంట్రల్ రైల్వే సేఫ్టీ బోర్డు చైర్మన్ మాధవి లత(Central Railway Safety Board Chairman Madhavi Latha) ప్రారంభించారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ లో రైల్వే అధికారులు చేపట్టిన థర్డ్ లైన్ ఫోటో ఎగ్జిబిషన్ ను ఆమె స్వయంగా పరిశీలించారు. రైల్వే విభాగాల అధికారులతో కలిసి బెల్లంపల్లి నుండి రెబ్బెన వరకు నూతనంగా చేపట్టిన థర్డ్ లైన్ ట్రాక్ తో పాటు వాగులపై నిర్మించిన రైల్వే బ్రిడ్జిలను ఆమె పరిశీలించారు. థర్డ్ లైన్ ను పర్యవేక్షించే అధికారులకు సంబంధించిన నూతన కార్యాలయాన్ని ఆమె పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం రైల్వే అధికారులతో కలిసి మంచిర్యాలకు వెళ్లిపోయారు.