calender_icon.png 28 August, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వరదతో నిండకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి

28-08-2025 05:41:33 PM

వలిగొండ (విజయక్రాంతి): ఏదుల్లగూడెం, ప్రోద్దుటూరు గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో వరద చేరకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి(CPM Mandal Secretary Sirpangi Swamy) డిమాండ్ చేశారు. గురువారం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ, ప్రొద్దుటూరు ఏదుల్లగూడెం గ్రామాల ప్రజలు కొద్దిపాటి వర్షం వచ్చిన జలదిగ్బంధంలో చిక్కుకు పోతున్నారని అన్నారు.

ఒకవైపు ప్రొద్దుటూరు నుండి వర్కట్పల్లికి వెళ్లే దారిలో మూసి పై హై లెవెల్ బ్రిడ్జి లేకపోవడంతో ఏదుళ్ళగూడెం గ్రామం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే రైల్వే బ్రిడ్జిలో పూర్తిగా వరద నీరు చేరి బయటికి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. అనేకసార్లు రైల్వే కాంట్రాక్టర్ కు చెప్పిన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని స్థానిక భువనగిరి ఎమ్మెల్యే  అనిల్ కుమార్ రెడ్డి వెంటనే రైల్వే బ్రిడ్జిని సందర్శించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.