15-02-2025 03:27:52 PM
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ(CM Revanth Delhi Tour)లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు. టెన్ జన్ పథ్ లో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశం కొనసాగింది.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కులగణన(Caste Census Survey), ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి(Revanth Reddy) చర్చలు జరిపారు. కొత్త ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్‌తో రేవంత్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఖాళీకానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడంపై రాహుల్‌కు సీఎం రేవంత్ వివరించారు.