26-07-2024 12:10:05 PM
ప్రాణాలు కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకం
హైదరాబాద్: ప్రజల ఆలోచనలు వినడం.. తమ ప్రజా ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే అత్యంత కీలకమైనదన్నారు. 90 శాతంపైగా యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని, గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురుచేశారని చెప్పారు. 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం వెల్లడించారు. అందరి ప్రాణాలు కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రభుత్వ విధానం అన్నారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనం వస్తోందన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో 483 మంది శిక్షణ ఉద్యోగలు పాల్గొన్నారు.