26-07-2024 11:54:36 AM
హైదరాబాద్: కన్నెపల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ... గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని వెల్లడించారు. పంటల సాగు కోసం నీటి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గతంలో నీటి సమస్యల లేదని చెప్పారు. ఎగువ నుంచి నీరు వచ్చే పరిస్థితి కనబడుటలేదని కేటీఆర్ తెలిపారు. 17 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ నిర్మించారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని పేర్కొన్నారు. అన్నారం. సుందిళ్ల గ్రౌటింగ్ జరిగిందని అధికారులు చెప్పారు.