22-09-2025 12:34:57 PM
హైదరాబాద్: అమెరికాతో దౌత్య సంబంధాల్లో మోదీ విఫలమయ్యారని.. ట్రంప్(Donald Trump) ఉత్తర్వులతో అమెరికాలో ఉద్యోగాలకు ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. మన దేశానికి సంబంధించిన వారు ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని.. ప్రముఖ కంపెనీల సీఈవోలు వారి మేధోశక్తిని మనదేశానికి వినియోగించాలని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాయని, విదేశాల్లో ఉన్న తెలంగాణ వారంతా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ది చేయాలని పొన్నం తెలిపారు.