18 August, 2026 | 8:35 PM

వర్షాకాలం చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

15-06-2024 09:35 PM

హైదరాబాద్ : వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణం స్పందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. ఓఆర్ఆర్ యూనిట్ గా విపత్తు నిర్వహణ విస్తృతం చేయాలని, ఓఆర్ఆర్ వరకు ఉన్నసీసీ కెమెరాలను అనుసంధానం చేయాలని చెప్పారు. కమాండ్ కంట్రోల్ కు వీలైనన్ని ఎక్కువ కెమెరాలు అనుసంధానం చేయాలన్నారు. నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ హెచ్చరికలు ఇవ్వాలని, ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, హోంగార్డుల నియామకం చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.