28-11-2025 12:00:00 AM
సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబర్ 27 (విజయ క్రాంతి): విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల గమ్యస్థానమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్ల డించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యాన్యు ఫ్యాక్చరి ంగ్, ఫార్మా రంగాలకు ఒక మంచి ఎకో సిస్టమ్‌ను రాష్ర్టంలో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయనను కలిసిన జర్మన్ ఫ్రీడరిక్- ఎబర్ట్- స్టిఫ్టంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డా.సబీన్ ఫాండ్రిక్, మిర్కో గుంథర్, క్రిస్టోఫ్ మోహ్ తదితరులకు రాష్ర్టం అమలు చేస్తున్న సుల భతర పారిశ్రామిక విధానాలను, సంక్షేమ పథకాలను వివరించారు.
అత్యంత ప్రతిభా వంతులైన యువత రాష్ర్టంలో ఉన్నందున నైపుణ్యాలకు కొదవలేదని తెలి పారు. జర్మనీ-తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు. జర్మనీలో పర్యటించాలని ఆ దేశ ఎంపీ, ఏఎఫ్‌డీ పార్లమెంటరీ గ్రూప్ ఫారిన్‌పాలసీ అధికార ప్రతినిధి మార్కస్ ఫ్రోహ్న్ మైయర్ ఆయనను ఆహ్వానించారు. దీంతో శ్రీధర్ జనవరిలో జర్మనీలో పర్యటించనున్నారు.