calender_icon.png 28 November, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువశక్తి నైపుణ్యాలు పురోగతికి ప్రతీకలు

28-11-2025 12:07:46 AM

  1. మున్ముందు భారత్ అంతరిక్ష రంగం మరిన్ని విజయాలు 
  2. స్కైరూట్ ఇన్ఫినిటీ వర్చువల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
  3. ఆస్ట్రోనాట్, స్పేస్ సైంటిస్ట్, ఏరో స్పేస్‌కలనను యువత సాకారం చేసుకోవాలి 
  4. అంతరిక్ష ప్రయోగంలో ప్రపంచానికి భారత్ దిక్సూచి
  5. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రంగారెడ్డి, నవంబర్, 27 (విజయక్రాంతి): యువనిపుణులు నైపుణ్యాలే దేశ సాంకేతిక వేగానికి, పురోగతికి ప్రతీకగా నిలుస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి గొప్ప విజయంగా ఆయన అభివర్ణిం చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ప్రధాని ఆవిష్కరించారు.

స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. స్కైరూట్ బృం దానికి అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. సైకిల్‌పై రాకెట్‌ను మోసుకెళ్లే స్థితి నుంచి మన అంతరిక్ష ప్రస్థానం ప్రారంభమైందని ప్రధాని గుర్తు చేశారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్పప్రతీక అని పేర్కొన్నారు.

భారత అంతరిక్ష రంగం భవిష్యత్‌లో మరిన్ని ఘనతలు సాధిస్తామని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అంతరిక్షంలో ఇది గొప్ప మైలురాయని పేర్కొన్నారు. భారత అంతరిక్ష రంగం భవిష్యత్‌లో మరిన్ని ఘనతలు సాధిస్తుందని పేర్కొన్నారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషమని చెప్పారు. స్కైరూట్ బృందానికి ప్రధానికి అభినందనలు తెలిపారు.

ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని అన్నారు. సైకిల్‌పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థా నం ప్రారంభమైందని గుర్తు చేశారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని ఆకాంక్షించారు. స్పేస్ సెక్టార్లలో కో ఆపరేటివ్, ఎకో సిస్టమ్‌ను తీసుకొచ్చామని, జెన్‌జెడ్ ఇన్నోవేటర్ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అంతరిక్ష రంగంలో కేంద్రం ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్‌లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. జెన్‌జెడ్ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్స్, సైంటిస్టులు అవకాశాలు అందిపుచ్చు కొని మరింత ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు.

దూరదృష్టితో కూడిన పాలసీ విధానాలు

స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి  హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంత గొప్ప విజయాన్ని సాధించిన స్కైరూట్ సిబ్బందికి, ముఖ్యంగా స్కై రూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకాకు శుభాకాంక్షలు తెలిపారు. దూరదృష్టితో కూడిన పాలసీ విధానాలు దేశంలోని యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్‌ను వెలికి తీయొచ్చని వీరి విజయం ఇవాల చాటి చెబుతోందన్నారు.

ఇప్పటివరకు డాక్టర్, ఇంజినీర్, పోలీస్ ఆఫీసర్ కావాలనే దేశంలోని ప్రతి ఇంట్లో కలలు కనేవారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఆ ఆలోచన మారింన్నారు. ఆస్ట్రోనాట్, స్పేస్ సైంటిస్ట్, ఏరో స్పేస్ వ్యాపారవేత్త కావాలనే కలలను కూడా సాకారం చేసుకోవచ్చన్న ఆత్మవిశ్వాసం యువతలో బలపడిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరిన్ని విజయాలు సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మన దేశ అంతరిక్ష రంగం, పరిశోధనలు మరింత ఎత్తుకు ఎదగాలని, ప్రపంచానికి దిక్సూచీగా నిలవాలని కోరుకుంటు న్నాను.