calender_icon.png 8 September, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యంగ్ ఇండియా అనేది.. నా బ్రాండ్

10-04-2025 12:25:04 PM

పోలీసుల కుటుంబాలకు శుభాకాంక్షలు

దేశానికే దార్శనికుడు పీవీ నరసింహరావు

దేశ భవిష్యత్తు.. తరగతి గదిలో ఉంది

యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ స్థాపించాం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) గురువారం నాడు పర్యటిస్తున్నారు. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(Young India Police School)ను సీఎం ప్రారంభించారు. విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పోలీసులకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అత్యంత ముఖ్యమైనదన్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుటుంబాలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుశాఖపై నాకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవే అన్నారు.

16 నెలలైన బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ''యంగ్ ఇండియా నా బ్రాండ్'' అన్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ స్థాపించామని అని సీఎం తేల్చిచెప్పారు. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహరావు(PV Narasimha Rao) అని సీఎం పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ మైనారిటీ గురుకులాల్లో కనీస వసతులు కూడా లేవని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందన్నారు. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావని సీఎం స్పష్టం చేశారు.