calender_icon.png 9 September, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి మజిలీలో చింతలెన్నో

08-09-2025 08:11:53 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామం ప్రస్తుతం నగర పాలక సంస్థలో విలీనం అయ్యి డివిజన్ గా ఏర్పడింది. డివిజన్ గా పేరుకే ఏర్పడిందని  సౌకర్యాలు ఏమాత్రం లేవని, అధికారుల పట్టింపు అసలే లేదని డివిజన్ ప్రజలు మాజీ ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. డివిజన్ నుండి అన్నిరకాల టాక్స్ లు వసూలుచేస్తున్నారు, కానీ వసతులు కల్పించడం గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దుర్శేడ్ స్మశానవాటికలో కనీస సౌకర్యాలు లేవని ఎన్నో సార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు.

డివిజన్ వాసులు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరపడానికి నరక యాతన పడుతున్నామంటున్నారు. శ్మశానవాటికకు వెళ్ళేదారి  పిచ్చి మొక్కలతో పెరిగి నడవటానికి ఇబ్బందిగా ఉన్నదని, మహిళలు స్నానం చేయుటకు ఏర్పాటు చేసిన గదుల్లో కుళాయి సౌకర్యం లేక స్నానపు గదుల్లో అస్తవ్యస్తంగా తయారయ్యి అందులోకి వెళ్లలేకుండా ఉన్నాయని, దీని వల్ల ఆరుబయటే స్నానం చేసే పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో అంత్యక్రియలు చేద్దామంటే అటు వెళ్ళడానికి డివిజన్ ప్రజలు జంకుతున్నారు.గత ఆరునెలల్లో ఎన్నో సార్లు ఎంతో మంది అధికారులకు మొరపెట్టుకున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న నాథుడే లేడని వారి బాధలను వెలిబుచ్చారు.

ఆదివారం కూడా దుర్శేడ్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మరణిస్తే అతని అంత్యక్రియలకు వారి కుటంబీకులు  చాలా ఇబ్బందులు పడ్డారు. నీటి సరఫరా లేకపోగా దానికి సంబంధించిన  మోటారు వేసుకున్దామంటే దానికి సంబంధిన విద్యుత్ ఫ్యూజ్ కూడా లేకపోవడం చాలా బాధాకరమని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా  మున్సిపల్ కమిషనర్ స్పందించి తమ కష్టాలు తీర్చవల్సిందిగా డివిజన్ ప్రజలు వేడుకుంటున్నారు.