08-09-2025 08:43:34 PM
కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే వికలాంగులకు రూ 6000 రూపాయలు పెంచి, వృద్ధులు వితంతువులు, ఒంటరి మహిళలు నేత, గీత బీడీ కార్మికుల పెన్షన్లు రూ 4 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్, విహెచ్ పిఎస్, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం అదరపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.