08-09-2025 08:21:45 PM
నకిరేకల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నకిరేకల్ శాఖ నూతన అధ్యక్షునిగా ఏవిఎం విద్యాసంస్థల అధినేత కందాల పాపిరెడ్డి . కార్యదర్శిగా రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆసంఘం జిల్లా ప్రతినిధులు ఆంజనేయులు రామలింగం ఆధ్వర్యంలో సోమవారం సంఘ కార్యాలయంలో ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందాల పాపిరెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులు తనపై నమ్మకం ఉంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సంఘం నూతన భవనం తన పదవీకాలంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘ సభ్యుల సంక్షేమం కోసం పాటుపడతానన్నారు. కోశాధికారిగా చిక్కు రవీందర్ అసోసియేట్ అధ్యక్షునిగా పోతుల రామచంద్రయ్య ఉపాధ్యక్షులుగా పోతుల వెంకటనారాయణ పూజార్ల ఉత్తర జాయింట్ సెక్రటరీగా భిక్షం రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి అంజయ్య పబ్లిసిటీ సెక్రటరీగా ఎస్ ఆంజనేయులు గౌరవ అధ్యక్షులుగా వంటల రామలింగం ముఖ్య సలహాదారుగా కందుల సోమయ్య లు ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు.