08-09-2025 08:24:57 PM
కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని సీతారాంపూర్ పరిధిలోని సర్వే నెం. 26 లో ప్రభుత్వ భూమి కుంట శిఖంలో ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన 30కిపైగా నిర్మాణాలపై, ఇంటి నెంబర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజా అవసరాల కోసం ఆ భూమిని వినియోగించాలని కోరారు. ఆయన వెంట పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె .బద్రి నేత ఉన్నారు.